Take a fresh look at your lifestyle.

సింగరేణి “గుర్తింపు సంఘముగా ఏఐటియుసి

0 786

ఐఎన్ టియుసి ఫై ఏఐటీయుసీ పై 1989 ఓట్లతో ఆదిక్యం

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. తొలుత బోనీ కొట్టిన ఐ ఎన్ టి యు సి వరుసగా మూడు ఏరియాలలో విజయం సాధించగా, ఆ తర్వాత ఏఐటీయూసీ యూనియన్ ముందంజలోకి వచ్చి చేరింది. సింగరేణి లోని 11 ఏరియాలలో 13 కార్మిక సంఘాలు పోటీ చేయగా కేవలం ఏఐటీయూసీ, ఐ ఎన్ టి యు సి రెండు యూనియన్ల మధ్యనే పోటీ కనిపించింది. బుధవారం అర్ధరాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపు వివరాలు ఇలా ఉన్నాయి. ఐ ఎన్ టి యు సి కొత్తగూడెం కార్పొరేట్ లో 296, ఇల్లందులో 46, , కొత్తగూడెం లో 233, , మణుగూరు లో 2, రామగుండం-3 లో 104, భూపాలపల్లిలో 804, ఏరియాలో గెలుపొందగా,

ఏఐటీయూసీ యూనియన్ రామగుండం-1 లో 333, రామగుండం-2 లో 417, శ్రీరాంపూర్ లో 2166, మందమర్రి లో 467, బెల్లంపల్లి లో 122 ఆదిక్యత సాధించింది. మొత్తానికి సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం గా ఏఐటియూసి విజయ బావుటా ఎగరవేసింది. సింగరేణిలో హోరాహోరి గా జరిగిన ఎన్నికల్లో ఐఎన్టీయూసీ పై ఏ ఏఐటీయూసీ అధిక ఓట్లు సాధించి, గుర్తింపుగా సంఘముగా ఎన్నికైనట్లు సింగరేణి యాజమాన్యం గుర్తించింది. దీంతో సింగరేణి ప్రాంతాలలో ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.