- తాడేపల్లిగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగం
- జనసేన-టీడీపీ సభలో ఆవేశంతో ఊగిపోయిన జనసేనాని
- జగన్ దృష్టిలో పవన్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అని వెల్లడి
- తాను కూడా అలాగే మాట్లాడగలనని హెచ్చరిక
సీఎం జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాటిమాటికీ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంటాడని, కానీ తామెప్పుడూ జగన్ అర్ధాంగి గురించి మాట్లాడలేదని పవన్ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభలో పవన్ ప్రసంగించారు.
“జగన్ కు సంబంధించినంత వరకు పవన్ కల్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు. అతడి దృష్టిలో నాలుగు పెళ్లిళ్లు అంటాడు. మరి ఆ నాలుగో పెళ్లాం ఎవరో తెలీదు… మరి అది జగనేమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తోంది జగన్! లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే… రా జగన్ రా!
భారతీ మేడం గారూ మీకు కూడా చెబుతున్నాను… మేం ఎప్పుడయినా సరే మిమ్మల్ని మేడం భారతి గారూ అని గౌరవంగా మాట్లాడతాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా గానీ, చంద్రబాబు అర్ధాంగిని మాట్లాడినా కానీ, నా భార్యను అన్నా కానీ మేం మిమ్మల్ని ఏమీ అనలేదు. పెళ్లాలు, పెళ్లాలు అంటాడు… ఆ మాట మేం మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారూ… ఒక్కసారి ఆలోచించండి. నేనేమీ ఇంగ్లీషు మీడియాలో చదువుకున్న వాడ్ని కాను. నాక్కూడా భాష వచ్చు… నేనూ మాట్లాడగలను” అంటూ పవన్ హెచ్చరించారు.