- నేడు బాలకృష్ణ బర్త్‌డే
- బాలకృష్ణ- బాబి కాంబోలోని ‘ఎన్‌బీకే 109 నుంచి గ్లింప్స్ విడుదల
- ఎస్ఎస్ తమన్ బాణీలు
- నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్త నిర్మాణం
నందమూరి బాలకృష్ణ- బాబి కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎన్‌బీకే 109’ నుంచి మేకర్స్ తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. నేడు (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక గ్లింప్స్‌లో బాలకృష్ణ ఎంట్రీ వీర లెవల్లో చూపించారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా, మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్ తమన్ బాణీలు అందిస్తున్నారు. ఇదిలా ఉంచితే, బలయ్య బర్త్‌డే సందర్భంగా సినిమా టైటిల్, విడుదల తేదీ కూడా రివీల్ చేస్తారని అభిమానులు భావించినా మేకర్స్ వీటిపై క్లారిటీ ఇవ్వలేదు.