- మొత్తం 11 వాహనాలను సిద్ధం చేసిన అధికారులు
- ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం
- చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం అధికారులు ఇప్పటికే కొత్త కాన్వాయ్ ని సిద్ధం చేశారు. మొత్తం 11 వాహనాలను సిద్ధం చేసి తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పార్క్ చేశారు. ఇందులో రెండు వాహనాలు జామర్ల కోసమని అధికారులు వివరించారు. టయోటా కంపెనీకి చెందిన ఈ వాహనాలు అన్నీ నలుపు రంగులో, 393 నెంబర్ తో సిద్ధమయ్యాయి. కాగా, ఈ నెల 12న ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.