Take a fresh look at your lifestyle.

వాట్సప్‌లో అందుబాటులోకి వచ్చిన మరో అప్‌డేట్

0 368
  • తేదీ ఆధారంగా చాట్‌ను సెర్చ్ చేసుకునే ఆప్షన్‌ను పరిచయం చేసిన పాప్యులర్ యాప్
  • సెర్చ్‌లో తేదీ ఎంటర్ చేసి చాట్‌ను చెక్ చేసుకునే అవకాశం
  • ప్రకటించిన మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్

యూజర్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లను పరిచయం చేసే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ మరో సరికొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లపై తేదీల ప్రకారం చాట్‌ను సెర్చ్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. పర్సనల్, గ్రూప్ చాట్‌లను తేదీని బట్టి సెర్చ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు వాట్సప్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన వాట్సప్ ఛానెల్‌లో ఈ ప్రకటన చేశారు. తేదీ ద్వారా వాట్సప్ చాట్‌ను సెర్చ్ చేయడం మరింత సులభమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇకపై ఏదైనా తేదీని ఎంచుకుని చాట్‌ను చూసుకోవచ్చు. మధ్యలో ఉండే మెసేజులు అన్నింటినీ దాటి నేరుగా ఎంచుకున్న తేదీ చాట్‌ను పరిశీలించుకోవచ్చు’’ అని వివరించారు.

కాగా ఈ ఆప్షన్ ఇప్పటికే ఐవోఎస్, మ్యాక్, డెస్క్‌టాప్ డివైజ్‌లపై అందుబాటులో ఉండగా తాజాగా ఆండ్రాయిడ్ డివైజ్‌లపై అందబాటులోకి వచ్చిందని వాట్సప్ పేర్కొంది. ఏదైనా చాట్‌, లేదా గ్రూప్‌ చాట్‌లోకి వెళ్లి పేరుపై ట్యాప్ చేస్తే సెర్చ్‌ ఆప్షన్ కనిపిస్తుంది. తేదీని ఎంటర్ చేస్తే సరిపోతుంది. కాగా గతవారం కూడా వాట్సప్ ఒక అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. టెక్స్ట్ ఫార్మాట్‌లకు షార్ట్ కట్‌లను పరిచయం చేసింది. బుల్లెట్ పాయింట్లు, ఇన్‌లైన్ కోడ్, బ్లాక్ కోట్‌ల ఫార్మాటింగ్ ఆప్షన్లను ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.