- ముగిసిన నారా లోకేశ్ యువగళం సభ
- విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ
- లోకేశ్ రాకతో మిన్నంటిన నినాదాలు
- వేదికపై ఉన్న నేతలను ఆప్యాయంగా పలకరించిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. లోకేశ్ 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర సాగించిన యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో… విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద టీడీపీ యువగళం-నవశకం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేసింది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా విచ్చేస్తున్నారు.
కాగా, సభా వేదికపైకి చేరుకున్న నారా లోకేశ్ పార్టీ నేతలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ, పేరుపేరునా పలకరిస్తూ, రెట్టించిన ఉత్సాహంతో కనిపించారు. వేదికపై ఉన్న తోడల్లుడు భరత్ తోనూ ఆత్మీయంగా మాట్లాడారు. లోకేశ్ రాకతో… జై లోకేశ్, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. జనసేన శ్రేణులు కూడా నినాదాలతో హోరెత్తించాయి.