- బండి సంజయ్‌కి వ్యతిరేకంగా కరీంనగర్ సీనియర్ల సమావేశం
- బండికి టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదన్న నాయకులు
- ప్రయివేటు ఫంక్షన్ హాలులో భేటీ అయిన నాయకులు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మళ్లీ కరీంనగర్ ఎంపీగా టిక్కెట్ ఇవ్వవద్దని ఆ పార్టీ సీనియర్ నాయకులు అధిష్ఠానాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లుగా మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. మరోసారి ఎంపీగా అవకాశమిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నాడని, కానీ ఆయనకు టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని అధిష్ఠానానికి చెబుతున్నారు.
ఈ మేరకు బండి సంజయ్‌కి వ్యతిరేకంగా కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కేసీఆర్ పైన దూకుడుగా ముందుకు వెళ్లారు. అయితే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయనను తప్పించి, కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం తెలిసిందే.