- ముంబైలోని తమ నివాసం ‘యాంటిలియా’లో ప్రత్యేక స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
- బెక్‌హామ్‌కి ముంబై ఇండియన్స్ జెర్సీని అందజేత
- యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా భారత సందర్శనలో ఉన్న ఫుట్‌బాల్ దిగ్గజం
భారత సందర్శనలో ఉన్న ఇంగ్లిష్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్‌కు భారతీయ సంపన్న వ్యక్తి ముకేష్ అంబానీ కుటుంబ సభ్యులు ప్రత్యేక స్వాగతం పలికారు. ముంబైలోని తమ నివాసం ‘యాంటిలియా’లో ముకేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ, కుమార్తె ఇషా, కుమారుడు ఆకాష్‌తోపాటు శ్లోకా మెహతా, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్ జెర్సీని బెక్‌హామ్‌కు బహుమతిగా అందించారు. ఈ జెర్సీపై ‘1 బెక్‌హామ్’అని ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలావుండగా న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీఫైనల్ మ్యాచ్‌ను బెక్‌హామ్ ప్రత్యక్షంగా స్టేడియంలో వీక్షించిన విషయం తెలిసిందే. యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న డేవిడ్ బెక్‌హామ్.. సచిన్ టెండూల్కర్‌తో కలిసి స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన జెర్సీని బెక్‌హామ్‌కు అందించాడు. రోహిత్‌కి ‘రియల్ మాడ్రిడ్’ జెర్సీని బెక్‌హామ్ అందించిన విషయం తెలిసిందే.