- హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో ఐటీ సోదాలు
- రంగంలోకి 40 బృందాలు
- మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో తెల్లవారుజాము నుంచీ సోదాలు
తెలంగాణలో మళ్లీ ఐటీ సోదాల కలకలం రేగుతోంది. హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడలో 40 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనఖీలు చేపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు నిల్వ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.