Take a fresh look at your lifestyle.

టీచర్ల శిక్షణ కోసం ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణమూర్తి

0 115
  • పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశవిదేశాల్లోని రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇవ్వాలని సూచన
  • ఈ దిశగా దేశవ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లు నెలకొల్పాలని సలహా 
  • జాతీయ విద్యావిధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని వ్యాఖ్య

స్టెమ్(STEM) రంగాల్లో  భారత్‌ అభివృద్ధి దిశగా టీచర్ల శిక్షణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. భారత్ సహా వివిధ దేశాల్లో పదివేల మంది రిటైర్డ్ టీచర్లతో ఇక్కడి పాఠశాల ఉపాధాయులకు స్టెమ్ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏటా బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని సూచించారు. టీచర్లు, పరిశోధకులను గౌరవించుకోవాలని, వారికి మంచి జీతాలు వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతోనే తాము 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఏర్పాటు చేశామన్నారు.

జాతీయ విద్యా విధానం లక్ష్యాలు సాధించేందుకు టీచర్ల శిక్షణ ఎంతో కీలకమని నారాయణమూర్తి అన్నారు. స్టెమ్ రంగాల్లో పాఠశాల ఉపాధ్యాయులకు రిటైర్డ్ టీచర్లతో శిక్షణకు దేశవ్యాప్తంగా ట్రెయిన్ ద టీచర్ సెంటర్లు నెలకొల్పారన్నారు. ఏడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం సాగాలని బుధవారం ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్‌ కార్యక్రమంలో ఆయన సూచించారు. ఇలా సుశిక్షితులైన టీచర్లు మరింత మంది టీచర్లకు మార్గదర్శకంగా మారతారని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.