- నేడు మాదిగల విశ్వరూప మహసభకు విచ్చేస్తున్న ప్రధాని
- ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభలలో పాల్గొననున్న మోదీ
- 27న హైదరాబాద్ రోడ్డు షో నిర్వహించనున్న ప్రధానమంత్రి
ప్రధాని నరేంద్రమోదీ నేడు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న మాదిగల విశ్వరూప మహసభకు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివరలో వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభలలో ఆయన పాల్గొంటారు.
27న హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ తెలంగాణ నాయకత్వం సభలకు జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. బీజేపీ 119 నియోజకవర్గాలకు గాను 111 స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేనతో పొత్తు ఉండటంతో జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించింది.