Take a fresh look at your lifestyle.

ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్స్ నిషేధం!

0 154
  • పరిసరాల్లో చెత్తాచెదారం పడేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిక
  • నోటీసు బోర్డు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
  • ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని స్పందించిన జీహెచ్‌ఎంసీ

ట్యాంక్ బండ్‌ మీద బర్త్ డే వేడుకలు నిర్వహించకుండా అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. చుట్టుపక్కల పరిసరాల కలుషితం, రోడ్డుపై వెళ్తున్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందిన ఫిర్యాదులపై చర్యలకు ఉపక్రమించింది. ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

పరిసరాల్లో చెత్తాచెదారం వేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా గమనిస్తుంటామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన హెచ్చరిక బోర్డును ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాగా యువత ట్యాంక్ బండ్‌పై బర్త్ డే వేడుకలతో హంగామా చేస్తున్నారు. అక్కడి పరిసరాలను అపరిశుభ్రంగా మార్చడంతోపాటు అటుగా వెళ్లేవారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీటిపై పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎట్టకేలకు స్పందించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ట్యాంక్‌బండ్‌పై నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.