Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌లో వర్థమాన సినీ తారల రేవ్ పార్టీ భగ్నం..

0 329

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. ఇప్పటికే పలుమార్లు డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు లింకులు ఉన్నాయనే విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో పలువురు సినీ ప్రముఖులు సిట్, సీబీఐ, ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి డ్రగ్స్ యదేచ్చగా నగరంలో సప్లై అవుతుందనే విషయం దిగ్బ్రాంతికి గురిచేసింది. నార్కో అధికారుల మెరుపుదాడుల్లో ఓ సినీ నిర్మాత, వర్థమాన సినీతారలు పట్టుపడటంతో సినీ పరిశ్రమ ఉలిక్కి పండింది. నార్కో అధికారుల దాడుల విషయంలోకి వెళితే..
abcd
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, రేవ్ పార్టీలు భారీగా నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకొన్న నార్కో అధికారులు పక్కాగా దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారంతో పకడ్బందీగా టీమ్‌తో కలిసి ప్లాన్‌ను అమలు చేశారు. హైదరాబాద్‌లోని విఠల్‌రావు నగర్‌లో రేవ్ పార్టీపై దాడులు చేశారు. నార్కో అధికారుల దాడులతో కంగారు పడిన సెలబ్రిటీలు, పార్టీలో ఉన్న ప్రముఖులు పారిపోయే ప్రయత్నం చేయగా.. అధికారులు పట్టుకొన్నట్టు సమాచారం. బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. నిర్మాత పర్యవేక్షణలో జరిగిన దాడిలో LSD, నిషేధిత మాదక ద్రవ్యాలను ఉపయోగించినట్టు అధికారులు దృస్టికి వచ్చింది. మెరుపుదాడుల్లో భారీగా LSD, ఇతర మాదక ద్రవ్యాలు ఉపయోగించినట్టు సమాచారం. భారీగా డ్రగ్స్ పట్టుపడటంతో నార్కో అధికారులు దిగ్బ్రాంతికి గురైనట్టు తెలిసింది. ఈ దాడుల్లో సినీ రంగానికి చెందిన అప్ కమింగ్ హీరోయిన్లు, యాక్టర్లు ఉన్నట్టు నార్కో అధికారులు గుర్తించారు. సినీ తారల పేర్లను గోప్యంగా ఉంచి ఈ రేవ్ పార్టీ నిర్వాహకులను, సూత్రధారిని పట్టుకొనేందుకు విచారణ చేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. గత కొద్దికాలంగా నైజీరియా, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున్న డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నార్కో అాధికారులు, తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో వారికి అందిన పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నగరంలో డ్రగ్స్ దందా వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.