Take a fresh look at your lifestyle.

ఆగస్ట్ 7వ తేదీన లాంచ్ అవుతున్న సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34

0 561

Samsung Galaxy F34 5G: సామ్సంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను వరుసగా లాంచ్ చేస్తోంది. గతవారం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 లను లాంచ్ చేసింది. వచ్చేవారం సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 ను లాంచ్ చేయబోతోంది.
సామ్సంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను వరుసగా లాంచ్ చేస్తోంది. గతవారం ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అయిన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 లను లాంచ్ చేసింది. వచ్చేవారం సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది.
ఆగస్ట్ 7వ తేదీన..
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5 జీ ఫోన్ ను సామ్సంగ్ కంపెనీ భారత మార్కెట్లో ఆగస్ట్ 7వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లో 50 ఎంపీ నో షేక్ కెమెరాను అమర్చారు. కొత్త తరం వినియోగదారులను ఆకట్టుకునేలా 16 వేర్వేరు లెన్స్ ఎఫెక్ట్స్ ను పొందుపర్చారు. ఈ 5జీ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమొలెడ్ 120 హెర్జ్స్ డిస్ ప్లే ఉంటుంది. ఈ డిస్ ప్లే కు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ పీక్ బ్రైట్ నెస్ 1000 నిట్స్. అలాగే, దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్జ్స్.

6000 ఎంఏహెచ్ బ్యాటరీ..
ఈ 5జీ స్మార్ట్ ఫోన్ లో సామ్సంగ్ 6000 ఎంఏహెచ్ ల భారీ బ్యాటరీని పొందుపర్చారు. ఫుల్ చార్జింగ్ అనంతరం కనీసం రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ ను కూడా డైనమిక్ గా రూపొందించారు. ప్రీమియం మెటీరియల్ తో ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్స్ లో ఇది లభిస్తుంది. అదనంగా, ఇందులో వాయిస్ ఫోకస్ ఫీచర్ ఉంది. ఇది బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తగ్గించి, వాయిస్, వీడియో కాల్స్ లో డిస్ట్రబెన్స్ లేకుండా చూస్తుంది.

Leave A Reply

Your email address will not be published.