Take a fresh look at your lifestyle.

పవన్‌ పై లీగల్‌ ఫైట్‌

0 188

విజయవాడ : వలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సర్కార్‌ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.: గ్రామ, వార్డు వలంటీర్లను ఉద్దేశిస్తూ జనసేన అధినేత పవన్‌ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌ గా తీసుకుంది ఏపీ సర్కార్‌. ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం స్పెషల్‌ సీఎస్‌అజయ్‌ జైన్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1973 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పవన్‌ కల్యాణ్‌ పై చర్యలకు సిద్ధమైంది సర్కార్‌. వలంటీర్లపై ఉద్దేశపూర్యకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కు ఆదేశాలు జారీ చేసింది. మహిళా వలంటీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ` 1973 ప్రకారం పవన్‌ కల్యాణ్‌ పై చర్యలకు సిద్ధమైంది ఏపీ సర్కార్‌. వలంటీర్లపై ఉద్దేశపూర్యకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయాలని పీపీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా వలంటీర్లను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. సీపీసీ 119/4 ప్రకారం కేసుల నమోదుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. జులై 9వ తేదీన ఏలూరులో తలపెట్టిన వారాహి విజయ యాత్రలో చేసిన వ్యాఖ్యల విషయంలో పవన్‌ ను విచారించేందుకు అనుమతి ఇస్తున్నట్లు జీవోలో ప్రస్తావించింది.ఇక ఏపీ ప్రభుత్వ జీవోపై పవన్‌ స్పందించారు. పంచకర్ల రమేశ్‌బాబు గురువారం మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌… వలంటీర్లపై మాట్లాడినందుకు ప్రాసిక్యూట్‌ చేయమని వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. అవసరమైతే తనని అరెస్ట్‌ చేసుకోవచ్చని… చిత్రహింసలు కూడా పెట్టుకోవచ్చంటూ కామెంట్స్‌ చేశారు. జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రాసిక్యూషన్‌ అంటే సిద్ధంగానే ఉన్నానని తెలిపారు.’’ నన్ను ప్రాసిక్యూట్‌ చేయమని ఆర్డర్‌ ఇచ్చారు. గుర్తుపెట్టుకో జగన్‌ నీ ప్రభుత్వాన్ని కిందకి లాగేది ఇదే’’ అంటూ కామెంట్స్‌ చేశారు పవన్‌ కల్యాణ్‌.

Leave A Reply

Your email address will not be published.