Take a fresh look at your lifestyle.

ఎస్బీఐ ఎఫ్‌డీ.. పోస్టాఫీస్‌ టీడీ.. ఏది లాభం..

0 465

న్యూఢల్లీి : రిస్క్‌కు ఇష్టపడని ఇన్వెస్టర్లు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)కే తమ పోర్ట్‌ఫోలియోల్లో ఎక్కువ భాగాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన ప్రతిఫలాలు, సులభంగా విత్‌డ్రా చేసుకునే అవకాశం, స్వల్ప`దీర్ఘకాలిక టెన్యూర్స్‌ వంటివి ఎఫ్‌డీలను సంప్రదాయ మదుపరులకు మరింత దగ్గరగా చేర్చుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను తీసుకొస్తున్నాయి. అయితే పోస్టాఫీస్‌ స్మాల్‌ సేవింగ్స్‌ స్కీం సైతం వివిధ కాలపరిమితుల్లో టైం డిపాజిట్ల (టీడీ) పేరిట ఎఫ్‌డీ పథకాలను అందిస్తున్నది. డిపాజిట్‌ కాలపరిమితినిబట్టి వీటిపై వడ్డీరేట్లుంటుండగా.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు ఆధారంగా బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం సవరించే వడ్డీరేటుపై పోస్టాఫీస్‌ టైం డిపాజిట్ల ఆదాయం ఆధారపడి ఉంటున్నది.
ఎస్బీఐ ఎఫ్‌డీ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. రెగ్యులర్‌ సిటిజన్స్‌కు ఏడాది నుంచి ఐదేండ్ల వ్యవధికిగాను రూ.2 కోట్ల దిగువ డిపాజిట్లపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీరేటును చెల్లిస్తున్నది. అయితే 400 రోజుల వ్యవధిగల ‘అమృత్‌ కలాశ్‌’ ప్రత్యేక డిపాజిట్‌పై గరిష్ఠంగా 7.10 శాతం వడ్డీరేటును ఇస్తున్నది. ఈ పథకం వచ్చే నెల 15 వరకే అందుబాటులో ఉంటుంది. ఇదిలావుంటే రూ.5 లక్షలదాకా ఉన్న ఎఫ్‌డీలను గడువులోగా తీసుకుంటే 0.50 శాతం, ఆపై విలువ కలిగిన వాటి ఉపసంహరణపై 1 శాతం చొప్పున జరిమానా పడుతుంది.
పోస్టాఫీస్‌ టీడీ
ప్రస్తుత జూలై`సెప్టెంబర్‌ త్రైమాసికానికిగాను ఎంపిక చేసిన పోస్టాఫీస్‌ టైం డిపాజిట్లపై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో ఏడాది టీడీపై వడ్డీరేటు 6.9 శాతానికి చేరింది. 2, 3 ఏండ్లకు 7 శాతం, ఐదేండ్లకు 7.5 శాతం వస్తుంది. ఈ డిపాజిట్లకు ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961 సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. అయితే టీడీ తీసుకున్న 6 నెలలదాకా దాన్ని ఉపసంహరించడానికి వీల్లేదు. ఆ తర్వాత 6 నెలల నుంచి ఏడాదిలోగా డిపాజిట్‌ను వెనక్కి తీసుకుంటే పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీరేటే వర్తిస్తుంది. ఒకవేళ 2/3/5 ఏండ్ల డిపాజట్లను ఏడాది తర్వాత మూడేండ్లలోపు ఉపసంహరించుకుంటే నిర్ణీత వడ్డీరేటు కంటే 2 శాతం తక్కువగా చెల్లిస్తారు.

Leave A Reply

Your email address will not be published.