డాన్స్ లో చిరంజీవి తరువాత ఎన్టీఆరే: సుచిత్ర చంద్రబోస్

సుచిత్ర చంద్రబోస్ ఎన్నో పాటలకి కొరియోగ్రఫర్ గా పనిచేశారు. ఎంతోమంది స్టార్ లతో కలిసి పనిచేశారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు. “నేను చాలా మంది డైరెక్టర్లతో కలిసి వర్క్ చేశాను. గుణశేఖర్ .. కృష్ .. సురేందర్ రెడ్డి వంటి ఇప్పటి స్టార్ డైరెక్టర్ల ఫస్టు సినిమాకి కొరియోగ్రఫీని అందించింది నేనే” అన్నారు.

ఇక డాన్స్ విషయానికి వస్తే .. చిరంజీవిగారు రంగంలోకి దిగిన తరువాతనే కొరియోగ్రఫర్స్ ఎక్కువ కసరత్తు చేయవలసి వచ్చిందనే విషయంలో నిజం ఉంది. చిరంజీవిగారితో చేయించిన ఒక స్టెప్ ను ఆ తరువాత మరో హీరోతో చేయిస్తే ఆడియన్స్  వెంటనే గుర్తుపట్టేస్తారు. అలా డాన్స్ ను ఆడియన్స్ కి అంత దగ్గరగా తీసుకువెళ్లే ప్రత్యేకత ఆయనకి మాత్రమే ఉంది” అని చెప్పారు.

“చిరంజీవి తరువాత ఈ తరం హీరోల్లో ఎవరు డాన్స్ బాగా చేయగలరంటే నేను ఎన్టీఆర్ పేరే చెబుతాను. ఇప్పుడున్న హీరోలంతా డాన్స్ బాగా చేసేవారే. కానీ చిరంజీవిగారి తరువాత ఆ స్థాయిలో అన్నిరకాల స్టెప్స్ ను ఎన్టీఆర్ చేయగలుగుతారు. అల్లు అర్జున్ కూడా తనని తాను మార్చుకుంటూ .. ఎదుగుతూ వచ్చాడు. డాన్స్ లో బన్నీ తరువాత పేరుగా రామ్ గురించి చెప్పుకోవచ్చు” అని ఆమె అన్నారు.

Leave A Reply

Your email address will not be published.