యాపిల్ తొలి కంప్యూటర్ చూశారా..? ఎంత వెరైటీగా వుందో!

యాపిల్ తొలి తరం ప్రొటోటైప్ కంప్యూటర్ వేలానికి రానుంది. ఇది యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడినది. 1976కు ముందు ఆయన దీన్ని వినియోగించే వారు. వేలం నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4 కోట్లు) రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్ఆర్ వేలం సంస్థ దీనికి వేలం వేయనుంది. ఇప్పటికే 2 లక్షల డాలర్లకు బిడ్డింగ్ చేరింది.

ఆగస్ట్ 18 వరకు వేలం కొనసాగుతుంది. స్టీవ్ వోజ్నియాక్, ప్యాటీ జాబ్స్, డేనియల్ కొట్కే తో కలసి స్టీవ్ జాబ్స్ డిజైన్ చేసిన 200 కంప్యూటర్లలో ఇది కూడా ఒకటి. అయితే, ఈ కంప్యూటర్ పని చేయడం లేదట. స్టీవ్ జాబ్స్ స్వయంగా కొన్ని విడిభాగాలను తీసి వేరే కంప్యూటర్ కోసం వినియోగించి ఉంటారని వేలం నిర్వహించే సంస్థ తెలిపింది. గతంలో 2014లోనూ యాపిల్ తొలి తరం కంప్యూటర్ ఒకటి 9,05,000 డాలర్లు పలకడం గమనార్హం.
Apple 1, computer, Steve Jobs, AUCTION

Leave A Reply

Your email address will not be published.