Home Political షార్ట్ లిస్ట్ లో ఇద్దరి పేర్లు… టీపీసీసీ పగ్గాలు బీసీకే

షార్ట్ లిస్ట్ లో ఇద్దరి పేర్లు… టీపీసీసీ పగ్గాలు బీసీకే

98285
0
  • క్లైమాక్స్‌కు సారథి ఎంపిక
  • 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బాధ్యతలు

తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ ఎవరు? కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీలో దీని గురించే రచ్చ జరుగుతోంది.అయితే పీసీసీ చీఫ్‌ను కాంగ్రెస్ పెద్దలు దాదాపు ఖరారు చేశారని.. ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవిపై ఎంతో మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. షార్ట్ లిస్ట్‌లో ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయని.. వారిలో ఒకరి పేరును రేపో మాపో ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. ప్రధానంగా మాజీ ఎంపీ మధుయాష్కీ, రేవంత్‌ రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సీల్డ్ కవర్‌లో వీరిలో ఒకరి పేరు ఉన్నట్టు సమాచారం.

అయితే పీసీసీ ఎంపీక కోసం అధిష్టానం చాలా అంశాలను పరిగణంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని, తెలంగాణ కాంగ్రెస్‌ను ముందుకు నడిపే సీనియర్‌ నాయకునికి పగ్గాలు అప్పగించాలని ఏఐసీసీ బావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేలా పార్టీని సన్నద్ధం చేయగలిగే వారికే పీఠం అప్పగించాలని కాంగ్రెస్ ఢీల్లి పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. సమాజిక సమీకరణాలు సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మధుయాష్కీ వైపే మోగ్గు చూపించే అవకాశం ఉంది.

మధుయాష్కీ బలమైన బీసీ నేత. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో కొనసాగడమే కాకుండా… తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రే పోషంచారు. సమైక్యాంధ్ర పాలనలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తెలంగాణ బిల్లు పాస్‌ కావడంలో ఆయన పాత్ర చాలా కీలకం. అందరిలో మాస్ ఇమేజ్ ఉన్న లీడర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నిఖార్సయిన నాయకుడు. పదునైన ప్రసంగాలు చేయగలగడం, ప్రత్యర్థులను ఇరుకున పెట్టగలిగేలా మాటల దాడులు చేయడం మధుయాష్కీకి ఉన్న ప్రధాన బలం. భూదందాలు, అవినీతి అరోపణలు లేని నేత. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు.

రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మధుయాష్కీకి… తెలంగాణ ప్రాంతీయ సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉంది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తునే… ప్రభుత్వ వైఫల్యాను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. అందుకే కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట మధుయాష్కీ లాంటి ఫేమ్ ఉన్న లీడర్‌కే పార్టీ పగ్గాలు ఇవ్వాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక క్లైమాక్స్‌కు చేరడంతో మరికొందరు మాత్రం, అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతున్న వ్యక్తినే ఎంపిక చేయాలని పలువురు నేతలు పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పీసీసీ సారథి ఎంపిక అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here