Home AP కలెక్టర్ జోలికొస్తే ఖబడ్దార్

కలెక్టర్ జోలికొస్తే ఖబడ్దార్

15
0

కలెక్టర్ జోలికొస్తే ఖబడ్దార్
ఎమ్మెల్యే కేతిరెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలి
మాదిగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

ఏపీ39టీవీ న్యూస్ మార్చి18
గుడిబండ: మడకశిర పట్టణంలోని మాదిగ పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నాయకులు కలెక్టర్ పై చేసిన ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు అక్కులప్ప ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా చేరి అక్కడ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఈ సందర్భంగా మాదిగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పై ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆయన స్థాయి మరచి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కలెక్టర్ కు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి దళితుల వైపు ఉంటే ఇలాంటి ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ ఎన్నో మంచి పనులు చేసి అవార్డులు పొందిన విషయాన్ని ఎమ్మెల్యే మర్చిపోయారని విమర్శించారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప జిల్లా సీనియర్ నాయకులు అంజినప్ప మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు తాలూకా ఉపాధ్యక్షుడు రామంజి తాలూకా అధ్యక్షుడు శంకర్ మండల అధ్యక్షుడు అంజి ఉపాధ్యక్షులు చందు మండల అధ్యక్షులు నరసింహమూర్తి లక్కన్న బాలు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here