ఈ రోజున నేను ఇక్కడ ఉండటానికి కారణం మా మావయ్యలే: సాయితేజ్

సాయితేజ్ హీరోగా ఆయన 15వ సినిమా రూపొందుతోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ కొనసాగింది. ఇందుకు సంబంధించిన ఈవెంటులో సాయితేజ్ మాట్లాడుతూ .. ” నేను ఈ స్టేజ్ పై నిలబడటానికి కారణం మా ముగ్గురు మావయ్యలు. వాళ్లకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.

ఇక ఈ గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ను అందించిన తారకు ను ఉద్దేశిస్తూ .. ” డియర్ తారక్ .. మొదటి నుంచి కూడా నాపై ఎంతో ప్రేమను .. అభిమానాన్ని చూపిస్తూ వచ్చావు. అదే ప్రేమను ఇప్పటికీ పంచుతున్నావు. ఎవరు ఏమనుకున్నా నీ ఫ్రెండ్షిప్ నాతో ఎప్పటికీ ఇలాగే  ఉండాలని కోరుకుంటున్నాను” అన్నాడు.

“మొదటి నుంచి కూడా నాకు మ్యాథ్స్ అంటే భయం .. అలాంటి మ్యాథ్స్ లెక్చరర్ అయిన సుకుమార్ గారు నా దగ్గరికి ఈ థ్రిల్లర్ ను తీసుకొచ్చాడు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కార్తీక్ దండు ఈ సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లడం ఖాయం’ అంటూ చెప్పుకొచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.