తెలంగాణ కాంగ్రెస్ నేత జె.గీతారెడ్డి భారత్ జోడో యాత్రలో గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించగా, ఆయన వెంట గీతారెడ్డి కూడా నడిచారు. అయితే, ఆమె రోడ్డుపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు, సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాదయాత్రలో కలకలం రేగింది.
కాగా, నిన్న కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. పాదయాత్రలో తోపులాట జరగ్గా, మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.