బీజేపీకి వణుకు మొదలైందా?

బీజేపీకి అప్పుడే వణుకు మొదలైనట్టుంది. అందుకేనేమో, తనకు నచ్చిన విధ్వంసాన్నే మళ్లీ ఇప్పుడు నమ్ముకుంది. అవును మరి, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరిస్తూ హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే.. చూసి సహించలేని బీజేపీ కేడర్​ ఆ హోర్డింగులు, ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చించి పారేసింది. అPCCయితే, బీజేపీ వాటిని అంతగా చించేయాల్సిన అవసరం ఏమొచ్చినట్టు?  

హోర్డింగుల్లో ఎక్కడా ఏ రాజకీయ పార్టీనీ విమర్శిస్తూ కామెంట్లు లేవు కదా. దేశంలోనే అత్యంత యువ రాష్ట్రం తెలంగాణకు అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించడం, రాష్ట్రాభివృద్ధి ప్రయాణంలో అందుకున్న లక్ష్యాలను వివరించడం తప్ప వివాదాలు, విమర్శలు వాటిలో ఏమీ లేవు కదా.

కేసీఆర్​ నాయకత్వంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేకనే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్​ పర్యటన సందర్భంగా బీజేపీ ఆ హోర్డింగులను చించేస్తున్నది. రాష్ట్రాన్ని కేసీఆర్​ ప్రగతి పథంలో నడిపించడం, సాధించిన లక్ష్యాలను చూసి బీజేపీకి అప్పుడే వణుకు మొదలైనట్టు కనిపిస్తోంది. అందుకేనేమో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అడుగడుగునా ఆటంకాలను సృష్టిస్తోంది. లేకపోతే వేరే రాష్ట్రాలూ అనుసరించేలా తెలంగాణ సాధించిన ప్రగతిని వివరిస్తూ పాజిటివ్​గా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పెట్టిన వెంటనే బీజేపీ ఎందుకు చించేస్తుంది?

హోర్డింగుల్లోగానీ, ఫ్లెక్సీల్లోగానీ ఎక్కడా ఎవరినీ తిట్టినట్టుగా, విమర్శించినట్టుగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు లేవు. ఆ ఫ్లెక్సీలన్నీ తెలంగాణ సాధించిన విజయాలకు చిహ్నాలు. అలాంటప్పుడు తెలంగాణ ప్రగతిని చూసి బీజేపీ ఎందుకు ఓర్వలేకపోతోంది?

అవును మరి, వారి జుమ్లాల (బూటకపు మాటలు)తో పని కానప్పుడు.. ఇలాంటి హమ్లా (విధ్వంసం)నే వాళ్లు నమ్ముకుంటారనేది మరోసారి తేలిపోయింది. విషాదకరమైన విషయమేంటంటే బీజేపీ ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఇప్పుడు ఈ హోర్డింగులు ఓ లెక్కా!!

Leave A Reply

Your email address will not be published.