అమ్మాయిల కోసమే డ్రగ్స్ కు అలవాటు పడ్డాను: సంజయ్ దత్

  • అప్పట్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గు పడేవాడినన్న సంజయ్ 
  • డ్రగ్స్ వాడితే ధైర్యం వస్తుందని భావించానని వెల్లడి 
  • డ్రగ్స్ నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో గడిపానన్న సంజయ్ 
బాలీవుడ్ లో ప్రముఖ నటుడు సంజయ్ దత్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వపర్ ఫుల్ పాత్రలు పోషించడంలో ఆయనది ఒక విలక్షణమైన శైలి. చేతినిండా ఆఫర్లతో ఎప్పుడూ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్లలో సంజూ భాయ్ ఒక్కరు. ఒకప్పుడు అగ్రహీరోగా కొనసాగిన సంజయ్ దత్… ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నారు. జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఒకానొక సమయంలో సంజయ్ దత్ డ్రగ్స్ కు బానిసైన సంగతి తెలిసిందే. ఈ అలవాటుపై ఆయన తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం అమ్మాయిల కోసమే తాను డ్రగ్స్ కు అలవాటు పడ్డానని సంజయ్ దత్ తెలిపారు. ఆ రోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గు పడేవాడినని… ఎలాగైనా వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించేవాడినని చెప్పారు. డ్రగ్స్ వాడితే కొంచెం ధైర్యం వస్తుందని, అమ్మాయిలకు కూల్ గా కనిపిస్తానని, వాళ్లతో మాట్లాడే అవకాశం సులభంగా లభిస్తుందనే భావనతో డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించానని తెలిపారు.

ఆ తర్వాత డ్రగ్స్ నుంచి బయటపడేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో గడిపానని చెప్పారు. రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపారు. తనను ‘డ్రగ్గీ’ అని పిలిచేవారని చెప్పారు. ఆ మచ్చను తొలగించుకోవాలనుకున్న తర్వాత… బాడీని బిల్డ్ చేయడం ప్రారంభించానని తెలిపారు. అప్పటి నుంచి తనను ‘క్యా బాడీ హై’ అన్నారని చెప్పారు. తాజాగా విడుదలైన యశ్ చిత్రం ‘కేజీఎఫ్2’లో సంజయ్ దత్ కీలక పాత్రను పోషించారు.

Leave A Reply

Your email address will not be published.