‘బాహుబలి-3’పై కీలక ప్రకటన చేసిన రాజమౌళి

  • పార్ట్ 3 తప్పకుండా వస్తుందన్న రాజమౌళి
  • దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నామని వెల్లడి
  • నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారన్న రాజమౌళి
‘బాహుబలి’ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు ఇండియాను ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దర్శకుడిగా రాజమౌళి కీర్తిప్రతిష్ఠలు ఆకాశాన్నంటాయి. మరోవైపు ‘బాహుబలి’ పార్ట్ 3 వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి-3’పై ఇటీవల ‘రాధే శ్యామ్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ మాట్లాడుతూ, పార్ట్ 3 గురించి తనకు తెలియదని, సమయం వచ్చినప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పాడు. 
తాజాగా ‘బాహుబలి-3’పై రాజమౌళి పూర్తి క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 3 తప్పకుండా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. బాహుబలి చుట్టూ జరిగే సంఘటనలను ఈసారి ప్రేక్షకులకు చూపిస్తామని చెప్పారు. మూడో పార్ట్ కు సంబంధించి వర్క్ చేస్తున్నామని తెలిపారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖంగా ఉన్నారని చెప్పారు. అయితే సినిమా రావడానికి కొంత సమయం పట్టొచ్చని అన్నారు. త్వరలోనే బాహుబలి సీక్వెల్ గురించి ఆసక్తికర వార్త రానుందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.